
తెలుగు, హిందీ, తమిళం.. ఇలా ఇండియన్ సినిమాలోని ప్రధాన భాషా సినిమాలన్నింటిలో నటిగా సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కొన్నేళ్ళ విరామం తర్వాత ఆమె ఈ మధ్యే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ హీరోగా తమిళంలో వంద కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన పులి సినిమాతో శ్రీదేవి సౌతిండియన్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తమిళ, తెలుగు భాషల్లో ఈమధ్యే పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా భారీ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
శ్రీదేవి చాలాకాలం క్రితం తర్వాత కనిపించిన సినిమా కావడంతో పులిపై మొదట్లో మంచి అంచనాలే కనిపించాయి. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి ఈ సినిమా కోసం పెద్ద మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా కోరారు. అయితే శ్రీదేవికి ఇవ్వాల్సిన మొత్తంలో పులి నిర్మాతలు పి.టి.సెల్వకుమార్, శిబు తమీన్‌లు 50 లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉందట. దీంతో తనకివ్వాల్సిన డబ్బులు చెల్లించమంటూ శ్రీదేవి నిర్మాతల కౌన్సిల్‌ను కలిశారు. ప్రస్తుతం తమిళ సినీ నిర్మాతల మండలి శ్రీదేవి ఇచ్చిన కంప్లైంట్‌పై విచారణ జరుగుపుతున్నారు.

