షూటింగ్ లో స్టార్ కమెడియన్ మేకప్ కష్టాలు !

Published on Jul 9, 2018 11:35 am IST

సినిమా షూటింగ్ అంటే అదొక విహార యాత్ర అని బాగా ఎంజాయ్ చెయ్యొచ్చని అనుకుంటారు బయట వ్యక్తులు. కానీ సినిమా షూటింగ్ ఎంత కష్టమో, టైమ్ కి వెళ్ళటానికి ఎన్ని ఇబ్బందులు పడాలో కింద వీడియోలో వెన్నెల కిశోర్‌ అవస్థను చూస్తే అర్ధమవుతుంది. పైగా సినిమా షూటింగ్ షెడ్యూల్‌ ఇంకా ముందుకు జరిగితే మాత్రం చాలా కష్టం అంటున్నాడు వెన్నెల కిశోర్‌.

వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం రవితేజ, ఇలియానా హీరోహీరోయిన్లుగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌ ఓ ముఖ్యమైన హాస్య పాత్రలో నటిస్తున్నారు. ఐతే షూటింగ్‌ 15 నిమిషాలు ముందుకు ప్లాన్‌ చేయడంతో మేకప్‌ కి టైమ్‌ సరిపోదని, ఇక చేసేది ఏమిలేక వెన్నెల కిశోరే స్వయంగా ట్రిమ్మింగ్‌ చేసుకుంటూ షూటింగ్ కు వెళ్లారు. ఆ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా అది ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది.

సంబంధిత సమాచారం :