థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ప్రధాన పాత్రలో సినిమా !

ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న స్టార్ కమెడియన్లలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కూడ ఒకరు. ఇప్పటికే పలు సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి ఆయా సినిమాలు విజయంలో కీలక పాత్ర పోషించారాయన. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు హరీష్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా మొతం పృథ్వి పాత్రపైనే నడుస్తుందని, ఇందులో కామెడీ ప్రధానంగా ఉండబోతోందని సమాచారం. అంతేగాక ఇందులో రాకేందు మౌళి, కల్పికలు హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ వి.పి.ఎస్.కళ్యాణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.