కె.ఏ.పాల్ పాత్రలో సునీల్ ?

Published on Jun 25, 2019 11:00 pm IST

కె.ఏ.పాల్.. తన వింత చేష్టలతో తన పొంతన లేని మాటలతో పిచ్చి చూపులతో ఓ రేంజ్ కామెడీని పండిస్తూ సోషల్ మీడియాలో మొన్నటివరకూ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా పాల్ త్వరలోనే సినిమాతో కూడా నవ్వించబోతున్నాడు. కాకపోతే పాల్ నటించడం లేదు, పాల్ పాత్రలో సునీల్ నటించబోతున్నాడు. పొలిటిక‌ల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి కొత్త డైరెక్ట‌ర్ దర్శకత్వం వహిస్తున్నారని.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

మరి పాల్ క్యారెక్టర్ ఆధారం చేసుకుని సునీల్ హీరోగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ నిజంగా రాబోతోందా..? ఒకవేళ వస్తే.. పాల్ పాత్రలో సునీల్ ఎంత వరుకు మొప్పిస్తాడో..? ఇంతకీ ఈ సినిమా పై మన ఇంటర్ నేషనల్ పాల్ ఏలా స్పందిస్తాడో..! ఇక ఈ సినిమాలో సునీల్ కి జోడిగా ఇద్దరి నటీమణులు నటించే అవకాశం వుందట. అయితే ఈ సినిమాలో పాల్ వింత చేష్టలు, పాల్ పిచ్చి మాటలు, ఉత్సాహంతో పాల్ గాల్లోకి పిడిగుద్దులు విసరడం వంటివి ఉంటాయో లేదో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More