భారతీయుడు 2 లో స్టార్ కమెడియన్

Published on Aug 20, 2019 9:21 am IST

శంకర్, కమల హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ భారతీయుడు 2. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 14న విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాజల్ అగర్వాల్ ,ఐశ్వర్య రాజేష్, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండగా హీరో సిద్దార్థ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ మూవీస్టార్ క్యాస్ట్ లిస్ట్ లో కమెడియన్ వివేక్ చేరారని సమాచారం.

వివేక్ తమిళంలో స్టార్ కమెడియన్స్ లో ఒకరు. అపరిచితుడు చిత్రంలో విక్రమ్ స్నేహతుడిగా, శివాజీ చిత్రంలో రజిని మామగా తెలుగు ప్రేక్షకులకు వివేక్ బాగా సుపరిచితుడే. హీరోలతో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకుంటూ ఆయన చేసే కామెడీ అనేక చిత్రాలలో విజయానికి దోహదం చేసింది. భారతీయుడు 2 లో కూడా వివేక్ ఓ ఫుల్ టైం కమెడియన్ గా అలరించనున్నారని తెలుస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు,తమిళ, హిందీ భాషలలో విడుదల కానుందని సమాచారం. కాగా భారతీయుడు చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :