వెబ్ సిరీస్ షూట్ ప్లాన్ చేస్తోన్న స్టార్ డైరెక్టర్ !

Published on Apr 4, 2021 2:04 am IST

‘మహర్షి’తో డైరెక్టర్ వంశీ పైడిపల్లి సూపర్ హిట్ కొట్టాడు. దాంతో ఆయన తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే వంశీ ఒక వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘ఆహా’ కోసం తీస్తోన్న ఈ వెబ్ సిరీస్ లో ప్యాడింగ్ ఆర్టిస్ట్ లతో పాటు ఒక స్టార్ హీరోయిన్ కూడా నటించబోతుందట. మరి ఆ నటీనటులు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా మహర్షి తరువాత వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసాడు. ఈ లోపు పరుశురామ్ తో సర్కారు వారి పాట అంటూ మహేష్ సినిమా మొదలెట్టేసాడు. దాంతో వంశీ తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ మళ్ళీ మహేష్ బాబుతోనే ఒక సినిమా చేస్తాడట. అది ఎప్పుడు అనేది క్లారిటీ లేకపోయినా.. మహేష్ కి ఆల్ రెడీ ఒక లైన్ కూడా చెప్పాడని… మహేష్ కూడా ఆ లైన్ పట్ల ఇంట్రస్ట్ గా ఉన్నాడని తెలుస్తోంది. మరి రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడితే.. ఈ గ్యాప్ లో మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడేమో.

సంబంధిత సమాచారం :