సోనూ సూద్ కోసం కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్

Published on May 19, 2021 1:00 am IST

నటుడు సోనూ సూద్ మొదటి లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సహాయం చేశారు. వేరొకరితో పనిలేకుండా సొంత ఖర్చులతో అనేక మందిని ఆదుకున్నారు. సొంత ఊళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు బస్సులు ఏర్పాటు చేయడం లాంటివి చేసిన ఆయన కరోనా సెకండ్ వేవ్ సమయానికి ఇంకొక అడుగు ముందుకు వేసి వైద్య సహాయం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మందికి ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, రేమిడిసివర్ లాంటి అత్యవసరమైన ఇంజెక్షన్లు, మందులు లాంటివి సరఫరా చేస్తూ ప్రాణాలు నిలబెడుతున్నారు. సోనూ సూద్ సహాయం వలన కొన్ని వందలమంది ప్రాణాలు దక్కించుకున్నారు.

దీంతో ఆయన పట్ల జనంలో హీరోయిక్ వర్షిప్ ఏర్పడింది. దేశం మొత్తం ఆయన్ను రియల్ హీరో అంటూ పొగిడేసింది. ఆయనకు భారీ సంఖ్యలో జనం అభిమానులు తయారయ్యారు. దీంతో ఆయనకు హీరోగా ఆఫర్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆయన కోసం కథలు తయారుచేస్తున్నారు. కొందరు ఇప్పటికే ఆయనకు కథలు కూడ వినిపించారు. తాజాగా ఒక పెద్ద డైరెక్టర్ కూడ సోనూ కోసం ఒక కథను రాసి వినిపించడం జరిగిందని, సోనూ కూడ ఓకే చెప్పాడని, సినిమా కూడ భారీగానే ఉంటుందని తెలుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు, సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :