రకుల్ సీరియస్ ట్వీట్ పై స్టార్ డైరెక్టర్ స్పందన !

Published on Jun 21, 2021 4:00 pm IST

హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌ గురించి ఓ ఆంగ్ల పత్రిక ‘తెలుగు చిత్రాల్లో రకుల్ కి అవకాశాలు కరవయ్యాయి’ అని రాసుకొచ్చింది. దీని పై రకుల్ స్పందిస్తూ.. ‘నాకు అర్థం కాని విషయం ఏమిటంటే.. వీళ్లు హెడ్డింగ్‌లో పెట్టినట్లు.. టాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావడం లేదని నేను ఎప్పుడు చెప్పాను ?. అసలు ఒక ఏడాదికి ఎన్ని సినిమాలు చేయగలం ? 365 రోజుల్లో ఇప్పుడు నేను చేస్తున్న ఆరు సినిమాలు కాకుండా కొత్త ఆఫర్స్‌ కోసం దయచేసి నా డేట్స్‌ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే ఆ విషయంలో మా టీమ్‌కి సాయం చేయండి’ అని ఆమె ట్వీట్ చేసింది.

అలాగే రకుల్ ఆ పత్రిక పై తనదైన శైలిలో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక రకుల్‌ ట్వీట్‌పై దర్శకుడు హరీశ్‌ శంకర్‌ స్పందిస్తూ.. ‘నాకు తెలుసు రకుల్‌.. షూటింగ్స్‌ తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో. ఇటీవల నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్‌ నీకు బాగా నచ్చింది, అయినప్పటికీ.. నీ డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ వాయిదా పడింది. నువ్వు ఇలాగే నీ సినిమాలతో అందరికీ సమాధానం చెప్పు’ అంటూ రకుల్ కి సపోర్ట్ చేశాడు హరీష్.

సంబంధిత సమాచారం :