స్టార్ డైరెక్టర్ కి కరోనా పాజిటివ్ !

Published on Apr 17, 2021 8:00 pm IST

కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ పెద్ద సమస్య అయిపోయింది. పైగా స్టార్స్ కు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో మేకర్స్ కి ఏం చేయాలో అర్ధం కావడంలేదు. మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సిందేనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆలియా భట్ కి, రణ్ బీర్ కపూర్ కి, నివేతా థామస్ కి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది.

అలాగే ఈ రోజు ఉదయం విలన్ సోనూసూద్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా మరో స్టార్ డైరెక్టర్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అనిల్ రావిపూడికి కోవిడ్ -19 పాజిటివ్. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారికంగా తెలిపారు. ఇప్పుడు అనిల్ ఎఫ్ 3 షూటింగ్ ప్రస్తుతానికి పోస్ట్ ఫోన్ చేశారు. ఇక అనిల్ తో సన్నిహితంగా ఉన్న మిగిలిన నటీనటులు కూడా తమ షూటింగ్స్ ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది.

సంబంధిత సమాచారం :