ఆహా కోసం స్టార్ డైరెక్టర్లు కూడా.. !

Published on Aug 9, 2020 8:16 pm IST

ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినప్పటి నుండి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. కాగా తాజాగా కొరటాల శివ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక వెబ్ సిరీస్ ను, వంశీ పైడిపల్లి సహకారంతో రెండు వెబ్ సిరీస్‌ లను ఆహా కోసం చేయబోతున్నారని తెలుస్తోంది. ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ ను రూపొందించడానికి ఇప్పటికే కొంతమంది యువ దర్శకులు కూడా ఇప్పటికే ముందుకు వచ్చి పని చేస్తున్నారు.

ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ కూడా వెబ్ సిరీస్ లు చేయాలని ప్లాన్ చేస్తుండటం విశేషం. అలాగే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా వెబ్ సిరీస్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నాడట. అదే విధంగా విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల కూడా ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు. ఇక భవిష్యత్ మొత్తం డిజిటల్ మీడియాదే అని అందరూ నమ్ముతున్నారు. ఓ వైపు థియేటర్స్ కి ఆదరణ తగ్గిపోతుండగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై నటీనటులు కూడా తమ ద్రుష్టి మళ్లిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More