సుమంత్ హీరోగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్మాత మధు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ఒక ప్రముఖ స్టార్ హీరో 20 నిమిషాల నిడివితో కూడిన కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఆ హీరో ఎవరనేది ప్రస్తుతానికి రహస్యంగా ఉంచామని, త్వరలోనే రాబోయే ట్రైలర్‌లో ఆ క్యారెక్టర్‌ను రివీల్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
దీంతో ఈ సినిమాలో క్యామియో ఇవ్వబోయే ఆ స్టార్ హీరో ఎవరా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.


