కేరళ కోసం స్టార్ హీరో అత్యధిక విరాళం !

vijay6

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి భారీ గా విరాళాలు అందుతున్నాయి. దాంట్లో భాగంగా తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ భారీ విరాళం ను ప్రకటించారు. విజయ్ కు తమిళ నాడు తో పాటు కేరళలోను అభిమానులున్నారు. ఆయన సినిమాలు అక్కడ కూడా బాగా ఆడుతాయి. అక్కడున్న అభిమాన సంఘాలతో కలిసి 70లక్షల రూపాయలను ఆయన వరద భాదితుల సహాయార్థం డొనేట్ చేశారు. సౌత్ లో సినిమా ఇండస్ట్రీ నుండి ఇదే అత్యధిక విరాళం కావడం విశేషం.

ఇక తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది ప్రముఖులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మెగాస్టార్ ఆయన ఫ్యామిలీ, నాగార్జున ,ఎన్టీఆర్ , ప్రభాస్ , కళ్యాణ్ రామ్, రామ్, వరుణ్ తేజ్ తదితరులు విరాళాలను అందజేసిన విషయం తెలిసిందే.

Exit mobile version