అభిమాని కాళ్ళకు నమస్కరించిన సూర్య !

తమిళ స్టార్ హీరో సూర్య వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. వివాదాలకు దూరంగా, అభిమానులకు దగ్గరగా ఉంటూ సినిమాలు, సేవా కార్యక్రమాలంటూ తన పని తాను చేసుకుంటూ పోయే సూర్య అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇప్పటికే పలుసార్లు సూర్య వ్యక్తిత్వం ఎటువంటిదో తెలియజేసే సంఘటనలు జరగ్గా తాజాగా ఆశ్చర్యం గిలిపే మరొక సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే నిన్న ‘గ్యాంగ్’ తమిళ వెర్షన్ యొక్క ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. వేడుకలో సూర్య వేదికపై ఉండి మాట్లాడుతుండగా కొంతమంది యువ అభిమానులు ఆయన్ను కలిసేందుకు వేదికపైకొచ్చి అమాంతం సూర్య కాళ్ళ మీద పది అభివాదం చేయగా అందుకు ప్రతిగా సూర్య కూడా అభిమాని కాళ్లకు నమస్కరించి ఇకపై కాళ్ళమీద పది నమస్కారం చేయెద్దని వినమ్రంగా తెలియజెప్పారు. దీంతో అందరూ కాసేపు షాక్ కు గురై సూర్య వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.