గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. కారణం ఏమిటి ?

గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. కారణం ఏమిటి ?

Published on Jul 19, 2026 10:53 PM IST

Salmaan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా ఈ విజువల్స్ లో సల్మాన్ ఖాన్ బాగా అలసటగా, బరువు పెరిగినట్లు కనిపించారు. దీంతో, ఓ దశలో గుర్తుపట్టలేనంతగా ఆయన మారిపోయాడు. నిజానికి గతంలోనే సల్మాన్ ఖాన్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

మరి అనారోగ్య సమస్యల కారణంగానే సల్మాన్ ఖాన్ లుక్ ఇలా మారిపోయిందా ?, లేక వేరే ఏదైనా కారణం ఉందా ? అనేది చూడాలి. అయినా, ఒక ఫోటో లేదా వీడియో ఆధారంగా సదరు హీరోగారి ఆరోగ్యం లేదా ఆయన లుక్ గురించి ఖచ్చితమైన నిర్ణయానికి రావడం సరైన పద్దతి కాదు. ఒక్కోసారి కెమెరా యాంగిల్, లైటింగ్, మేకప్, డ్రెసింగ్ స్టైల్ వల్ల కూడా లుక్ వేరుగా కనిపించొచ్చు.

తాజా వార్తలు