మరో బాలీవుడ్ మూవీ కి రెడీ అవుతున్న స్టార్ హీరో.

Published on Jun 5, 2019 9:54 pm IST

హీరో ధనుష్ మరో మారు హిందీ లో తన అదృష్టం పరీక్షించుకోనున్నారట. ప్రస్తుతం ధనుష్ ”ది ఎక్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్” అనే ఇంగ్లీష్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాం లో పాల్గొన్న ఆయన త్వరలో నటించబోయే హిందీ మూవీకి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీడియా తో పంచుకున్నారు.
గతంలో ధనుష్ ‘రాంఝాన’ అనే హిందీ మూవీలో నటించారు. ఈ మూవీ ని డైరెక్ట్ చేసిన ఆనంద్ ఎల్ రాయ్ నే తన తదుపరి మూవీకి కూడా దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. మీరు హిందీలో సినిమాలు ఎందుకు చేయడం లేదు అన్న ప్రశ్నకు సమాధానంగా, మంచి స్రిప్ట్ దొరకకపోవడం వలనే అని చెప్పారు. ది ఎక్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్” భారత వీధి ఇంద్రజాలికులపై రోమన్ పెర్తెలోస్ రాసిన బుక్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ధనుష్ హాలీవుడ్ జర్నీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More