రామ్ చరణ్ తో ఢీ కొట్టనున్న స్టార్ హీరో.?

రామ్ చరణ్ తో ఢీ కొట్టనున్న స్టార్ హీరో.?

Published on Oct 25, 2015 6:05 PM IST

nagarjuna-and-charan-1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మెగాస్టార్ చిరంజీవి అతిధి పాత్రలో నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుద్నా స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధించుకొని మొదటి వారంలోనే 35 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. బ్రూస్ లీ సినిమా రిలీజ్ కి ముందే చరణ్ తమిళంలో విజయం సాధించిన ‘తని ఓరువన్’ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి కనిపించాడు. కానీ తెలుగులో ఈ రోల్ కోసం ఎవరిని ఫైనలైజ్ చెయ్యాలా అని ఈ చిత్ర టీం బుర్రలు బద్దలు కొట్టుకుంటోంది.

ఇప్పటికే విలన్ రోల్ కోసం అరవింద్ స్వామి, మాధవన్, జగపతి బాబు, రాజశేఖర్ ల పేర్లు వినిపించినప్పటికీ ఎవ్వరినీ ఫైనలైజ్ చేయలేదు. కానీ తాజాగా చరణ్ కి విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునని పరిశీలిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్టైలిష్ విలన్ పాత్రలో నాగార్జున అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. నాగార్జున కూడా ఈ విషయంలో సముఖతగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఈ విషయంలో ఫిక్స్ అవ్వలేం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎన్.వి ప్రసాద్ – డివివి దానయ్య కలిసి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు