నయనతారను ఢీకొట్టబోతున్న స్టార్ హీరో

Published on Jun 22, 2021 9:04 pm IST

లేడీ సూపర్ స్టార్ నయనతార కరోకా లాక్ డౌన్ వలన సినిమా పరిశ్రమ మందగించిన సమయంలో కూడ కొత్త సినిమాలకు సైన్ చేసింది. ఇప్పటికే ఆమె నటించిన చిత్రం ‘నెట్రికారన్’ విడుదలకు సిద్దమవుతుండగా రజినీతో చేసిన ‘అన్నాత్తే’ కూడ ముగింపు దశలో ఉంది. ఈ రెండూ కాకుండా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి ఒక చిత్రం చేస్తోంది. ఇవన్నీ కాకుండా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో కొత్తగా రెండు సినిమాలకు సైన్ చేసింది.

వీటిలో ఒక చిత్రాన్ని నూతన దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు ఉండబోతున్నారు. ప్రధానంగా ప్రతినాయకుడి పాత్రలో స్టార్ హీరో నటిస్తున్నాడని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో సుదీప్. చిత్ర బృందం ఆయన్నే విలన్ పాత్ర కోసం తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోందట. ఆయన కూడ విలన్ రోల్ చేయడానికి సుముఖంగానే ఉన్నారట. విలన్ రోల్ చేయడం సుదీప్ కు కొత్తేమీ కాదు. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంలో ప్రతినాయకుడి రోల్ చేసి విశేషంగా మెప్పించారు ఆయన.

సంబంధిత సమాచారం :