‘ఎన్టీఆర్‌’కి.. ఎవరు ఏ విధంగా.. !

Published on May 21, 2019 4:00 am IST

జూ ఎన్టీఆర్‌ ఈ రోజు తన 36వ పుట్టినరోజు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. తెల్లవారుజామునే అభిమానులు కొందరు తారక్‌ ఇంటికి చేరుకొని మరి తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులతో పాటు సినీ స్టార్స్ కూడా ఎన్టీఆర్ కు సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ రోజు మొత్తం సోషల్ మీడియాలో ‘ఎన్టీఆర్’ పేరే ట్రెండింగ్ అయిపొయింది. ఇక సినీ ప్రముఖుల్లో.. ఎవరు ఏ విధంగా, ఎన్టీఆర్ కు బర్త్‌ డే విషెస్ చెప్పారో చూద్దాం.

 

జూ ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. కానీ నువ్విప్పుడు సీనియర్.. ఎంజాయ్ – కమల్ హాసన్

 

‘నా ప్రియమైన తారక్’.. మరియు నా భీమ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు – రాజమౌళి

 

తారక్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి. అలాగే జీవితాంతం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా – రామ్‌చరణ్‌

 

హ్యాపీ బర్త్‌డే తారక్‌.. నువ్విలానే పూర్తి హ్యాపీనెస్ తో మరియు సక్సెస్ తో ఉండాలి – వెంకటేష్

 

హ్యాపీ బర్త్‌ డే బ్రదర్‌.. రాక్‌ ఆన్ – రానా దగ్గుబాటి

 

నా సోదరుడు ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు.. నువ్విప్పుడూ ఇంతే గొప్పగా ఉండాలి – హీరో రామ్

 

హ్యాపీ బర్త్‌డే తారక్‌.. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను – సాయి ధరమ్‌ తేజ్‌

 

పవర్‌ ప్యాక్డ్‌ మరియు పవర్‌ హౌజ్‌ అయిన తారక్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు – సీనియర్ నరేష్

 

బంగారు మనసున్న సింహానికి హ్యాపీ బర్త్‌ డే – స్వప్నా దత్

మన జనరేషన్ లోనే గొప్ప నటుడు ఆలాగే తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణమైన ఎన్టీఆర్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు – హరీశ్‌ శంకర్‌

 

నిజమైన స్నేహితుడు మరియు అద్భుతమైన నటుడైన.. నా ప్రియమైన సోదరుడు తారక్‌ కు జన్మదిన శుభాకాంక్షలు – కోన వెంకట్‌

 

హ్యాపీ బర్త్‌డే తారక్‌. నీలో ఉన్న పాజిటివీని ఎల్లప్పుడూ ఇలాగే అందరికీ పంచుతూ ఉండు – కాజల్‌ అగర్వాల్‌

 

తారక్‌ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు, నా వందో సినిమా (అరవింద సమేత..) అయినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. యంగ్‌ టైగర్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు – తమన్

 

పుట్టిన రోజు శుభాకాంక్షలు తారక్‌ గారు – అనిల్‌ రావిపూడి

 

తెలుగు సినీ పరిశ్రమలోని గొప్ప నటుల్లో ఒకరైన ఎన్టీఆర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు – వెన్నెల కిశోర్‌

 

తారక్‌ సినిమాలో నటించాలన్నది నా కోరిక. మల్టీ టాలెంటెడ్‌ నటుడికి హ్యాపీ బర్త్‌డే – కస్తూరి

సంబంధిత సమాచారం :

More