2020లో స్టార్ హీరోల సందడి ఉండదేమో..!

Published on Apr 5, 2020 1:05 pm IST

కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై పంజా విసిరింది. టోటల్ లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ అనేక కొత్త చిత్రాల విడుదల మరియు షూటింగ్స్ నిలిచిపోయాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో 2020లో పెద్ద హీరోల సినిమాల విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం చేస్తున్న ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడింది. నిజానికి ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయాలని భావించారు. ఆచార్య దసరాకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ జాను షూటింగ్ కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. అనేక అవాంతరాల తరువాత ఇటీవలే మొదలైన ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదాపడింది. భారీ పీరియడ్ మూవీ కావడంతో షూటింగ్ కి చాలా సమయం పడుతుంది. ఈ మూవీ కూడా 2021కి పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక బన్నీ సుకుమార్ మూవీ 2021ఏప్రిల్ కి వెళ్ళిపోయింది. ఇలా 2020 కి రావలసిన స్టార్ హీరోల సినిమాలు 2021కి వెళ్లిపోయాయి.

సంబంధిత సమాచారం :

X
More