కళ్యాణ్ రామ్ సరసన స్టార్ హీరోయిన్ !


నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఒక్కో మెట్టు పైకెదుగుతున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ‘ఇజం’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇటీవలే రెండు కొత్త సినిమాల్ని అనౌన్స్ చేశారు. వాటిలో ఒక చిత్రాన్ని తమిళ దర్శకుడు జయేంద్ర డైరెక్ట్ చేయనుండగా మరొక చిత్రాన్ని నూతన దర్శకుడు ఉపేంద్ర మాదవన్ తెరకెక్కించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూన్ 9 నుండి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన స్టార్ హీరో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. గతంలో కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమై స్టార్ హీరోయిన్ గా మారింది. ఇకపోతే ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే టైటిల్ ను ఖరారు చేసిన ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, విశ్వ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.