కమల్, రజినీ మల్టీస్టారర్ లో స్టార్ హీరోయిన్? క్లారిటీ ఇచ్చేసింది

కమల్, రజినీ మల్టీస్టారర్ లో స్టార్ హీరోయిన్? క్లారిటీ ఇచ్చేసింది

Published on Jun 21, 2026 12:50 AM IST

ఇప్పుడు సౌత్ సినిమా దగ్గర క్రేజీ హైప్ సెట్ చేసుకున్న ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల కాంబినేషన్ సినిమానే అని చెప్పాలి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేయనున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ ని రేకెత్తించింది. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కావాల్సి ఉండగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో ఓ స్టార్ హీరోయిన్ ప్రెజెన్స్ విషయంలో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది.

మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు కమల్ కూతురు శృతి హాసన్ కోసమే.. శృతి రజినీకాంత్ జిస్తా సినిమా కూలీ లో నటించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ మల్టీస్టారర్ లో కూడా ఉండొచ్చు అని పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఫైనల్ గా శృతి హాసన్ అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఫ్యాన్స్ ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పొచ్చు. రీసెంట్ గానే పెద్ది స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ మెరిసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు