సొంత యాప్ ను లాంచ్ చేసిన రకుల్ ప్రీత్ !

20th, March 2018 - 03:16:07 PM

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తన అధికార యాప్ ను లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరవుతానని, ఇందులో ప్రత్యేకమైన విశేషాలు, వివరాలు చాలా ఉంటాయని, అభిమానులతో లైవ్ చాట్స్ కూడ ఉంటాయని రకుల్ అన్నారు.

ఈ యాప్ ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలకు లింక్ అయి ఉంటుంది. ఈ యాప్ ను కలిగి ఉండటం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ గురించిన ఎక్స్ క్లూజివ్ విషయాలను తెలుసుకొనే వీలు కలుగుతుంది. ఇకపోతే రకుల్ ప్రీత్ ప్రస్తుతం తమిళంలో కార్తి, సూర్య వంటి హీరోలతో నటిస్తూనే హిందీలో అజయ్ దేవగన్ సరసన కూడ నటించనుంది.