మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో రవితేజ శ్రీను వైట్లతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత రవితేజ ఇదే సంస్థలో మరో సినిమా చెయ్యబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించబోతున్నట్లు సమాచారం. క్యాథరిన్ థ్రెస మరో హీరోయిన్ గా కనిపించబోతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
రవితేజ నటించిన తాజా సినిమా ‘నేలటికెట్’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఏడాది మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ, సంతోష్ శ్రీనివాస్ సినిమాకు సంభందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
