బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి హిందీ భాషలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే కంగనాకు, క్రిష్ కు మధ్య విభేదాలు వచ్చాయని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు పై కంగనా స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. క్రిష్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేం మణికర్ణిక చిత్రం గురించి రోజూ చర్చించుకుంటాం. మా సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవము రోజున విడుదల కాబోతోంది. ఈ గ్యాప్ లో మా రైటర్స్ కొన్ని అసక్తికరమైన సీన్స్ ను జోడిస్తే బాగుంటుందని చెప్పారు. దానికి నేను కూడా అంగీకరించాను తప్ప క్రిష్ తో మాత్రం ఎటువంటి విభేదాలూ లేవు అని కంగనా చెప్పుకొచ్చింది. సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది .
