‘ట‌క్ జ‌గ‌దీష్‌’లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ !

‘ట‌క్ జ‌గ‌దీష్‌’లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ !

Published on Apr 25, 2021 12:00 AM IST

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తోన్న కొత్త సినిమా ‘టక్ జగదీష్’. పైగా తనకు ‘నిన్ను కోరి’ లాంటి ఎమోషనల్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో ఒక స్టార్ హీరోయిన్ కనిపించబోతుందని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరో చూడాలి. ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్, మెయిన్ గా బ్రదర్ సెంటిమెంట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ‘నిన్నుకోరి`వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ’ట‌క్ జ‌గ‌దీష్‌’. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు