‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా స్టార్ హీరోయిన్ ?

Published on Apr 21, 2019 4:11 pm IST

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కానీ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో ‘బిగ్ బాస్ 3’కి ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా పెట్టాలని బిగ్ బాస్ నిర్మాణ సంస్థలు ముమ్మరంగా ప్రయత్నించినప్పటికీ.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్ బిజీగా ఉండటం వల్ల ‘బిగ్ బాస్ 3’ చేయలేనని తేల్చేసాడు.

ఇక చేసేదేం లేక ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా ఓ హీరోయిన్ని తీసుకుంటే ఎలా ఉంటుందని నిర్వాహకులు ఆలోచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలను అనుష్క శెట్టికి అప్పజెప్పారని సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజం అయితే.. మరి హోస్ట్ గా అనుష్క ఎలా చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :