బాయ్ ఫ్రెండ్ కోసం నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్ !
Published on Jun 20, 2018 11:22 am IST

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరు, లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ల మధ్యనున్న ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారు. ఇందులో నయనతార కథానాయకిగా నటించనుంది.

ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఉండనుంది. ఇందులో మరొక విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని స్వయంగా నయనతార నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. యువ హీరో ఆత్రవ ఇందులో కథానాయకుడిగా నటించనున్నాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook