తేజ కోసం పారితోషికం తగ్గించుకున్న స్టార్ హీరోయిన్ !

Published on Jul 1, 2018 9:54 pm IST

తేజ తెరకెక్కించిన ‘లక్ష్మి కళ్యాణం’ అనే చిత్రం తో తెలుగు తెరకు పరిచియమయ్యారు నటి కాజల్ అగర్వాల్ .ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందిపుచ్చుకొని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇటీవల తేజ తెరకెక్కించిన ‘నేను రాజు నేనే మంత్రి’ చిత్రంలో రానా సరసన నటించింది.ఇక ఇప్పుడు తేజ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్నది . ఈ చిత్రం కోసం ఆమె పారితోషికాన్ని కూడా తగ్గించుకొని మరి నటించడానికి అగీకరించిందట . ఇందంతా తేజ మీద ఉన్న అభిమానం తో పాటు ఆయన సినిమాలో హీరోయిన్ పాత్ర కు ప్రాముఖ్యత ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నారట కాజల్ .

ఇక ఈ చిత్రంతో కాజల్ , సాయి శ్రీనివాస్ తో రెండవ సారి నటించనుంది . ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు . ఈ చిత్రం తరువాత వీరు తేజ దర్శకత్వంలో నటించనున్నారు .

సంబంధిత సమాచారం :