ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేసిన స్టార్ హీరోయిన్ !

Published on Apr 18, 2021 10:08 pm IST

వరుణ్ ధావన్‌, కృతీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా భేడియా. ఈ చిత్రానికి అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహిస్తుండగా దినేశ్‌ విజన్‌ నిర్మిస్తున్నాడు. అభిషేక్‌ బెనర్జీ, దీపక్‌ డోబ్రియాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్‌ నిమిత్తం వరుణ్‌ ధావన్‌ ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నాడు. అక్కడ చిత్రయూనిట్‌ సభ్యుల్లో ఒకరి కుమార్తెది బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ వీడియోను కృతీసనన్‌ షేర్‌ చేసింది.

పైగా వీడియో షేర్ చేస్తూ.. ‘ఈ వీడియో మిమ్మల్ని రోజంతా నవ్విస్తుంది కావచ్చు. కానీ ఇలాంటి ఘటనలు మనమూ ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉన్నాం. కానీ మరీ ఘోరంగా చిన్నపాప అని కూడా చూడకుండా ఇలా చేస్తావ్‌ అనుకోలేదు వరుణ్‌..’ అని రాసుకొచ్చింది. అటు వరుణ్‌ మాత్రం ‘ఐయామ్‌ సారీ.. ఇది పాప బర్త్‌డే కానీ, సెలబ్రేషన్స్‌ మాత్రం ఆమె తండ్రివి’ అని కొంటెగా బదులిచ్చాడు.

ఇంతకీ వీడియోలో ఏముంది అంటే.. వరుణ్‌ ధావన్‌ కేక్‌ కట్ చేసిన తరువాత పుట్టినరోజు పాపాయికి తినిపిస్తాడనుకుంటే ఆ కేకు ముక్కను ఆమె తండ్రికి తినిపించాడు. దీంతో ఎంతో ఆశగా నోరు తెరిచిన చిన్నారి ముఖంలో ఒక్కసారిగా నిరాశ కమ్ముకుంది. అది చూడటానికి చాలా ఫన్నీగా ఉంది.

సంబంధిత సమాచారం :