రజనీ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లను పరిశీలిస్తున్నారు !

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తర్వాతి సినిమాను యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానుంది.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో రజనీ సరసన కథానాయకిగా త్రిష, అంజలి మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెలను పరిశీలిస్తున్నారని, వీరి ముగ్గురిలోనే ఎవరో ఒకర్ని ఎంచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి దర్శక నిర్మాతలు చివరగా ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి.