
‘కుమారి 21 ఎఫ్’.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి ‘సుకుమార్ రైటింగ్స్’ అన్న బ్యానర్‌పై రూపొందించిన క్యూట్ లవ్‌స్టోరీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈనెల 31 పెద్ద ఎత్తున జరగనుంది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాకరు కానుండడం విశేషం. ఇక ఇప్పటికే టీజర్‌తో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా పలు ఆసక్తికర ప్రమోషన్స్‌తో యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా టాప్ స్టార్స్ అంతా ఈ సినిమా గురించి మాట్లాడి ‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమాను క్రేజీ ప్రాజెక్టుగా మార్చేశారు. ఇక స్టార్ హీరోల సపోర్ట్‌తో క్రేజీగా మారిపోయిన ఈ సినిమా, తాజాగా పలువురు హీరోయిన్లను సపోర్ట్‌ను తెచ్చుకొని మరింత క్రేజీగా నిలుస్తోంది. కృతి సనన్, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, ప్రణీత లాంటి హీరోయిన్లు ఈ సినిమాలోని డైలాగ్‌కు డబ్స్‌మ్యాష్ వీడియోలను తయారు చేసి విడుదల చేస్తున్నారు. కుమారి 21 ఎఫ్ టీం చేస్తోన్న ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్, హీబా పాటీల్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. నవంబర్ నెల్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

