‘ఎఫ్2’ పై ఇంట్రస్ట్ చూపిస్తోన్న స్టార్ హీరోలు !

‘ఎఫ్2’ పై ఇంట్రస్ట్ చూపిస్తోన్న స్టార్ హీరోలు !

Published on Jan 31, 2019 6:24 PM IST

F2
ఈ సంక్రాంతికి పోటీగా వచ్చిన మూడు తెలుగు సినిమాల్లో ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను, దిల్ రాజు నిర్మించారు. కాగా ఈ చిత్రం ఇప్పుడు ఇతర భాషల్లోకి కూడా వెళ్లబోతుంది.

ఇప్పటికే ఈ కామెడీ ఎంటర్ టైనర్ పై త‌మిళ‌, హిందీ భాష‌ల్లో కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారట. దాంతో ఆయా భాషల్లో కూడా ఈ సినిమాని రీమేక్ చేయనున్నారు. ఈ విషయం గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ”హిందీలో ఒకరు ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఈ సినిమా పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే ఏ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు, అలాగే ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు ? అనే వివ‌రాలు త్వరలో తెలుస్తాయి.

అయితే హిందీలో ఈ సినిమాని నేను నిర్మించను. నిర్మాణ భాగ‌స్వామిగా మాత్రం ఉంటానని దిల్ రాజు తెలిపారు. మొత్తానికి ఎఫ్ 2 ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవడంతో పాటు వెంకీ కెరీర్ లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది.

తాజా వార్తలు