అఖిల్, మోనాల్ పై మరో అదిరిపోయే ఎపిసోడ్ ప్లాన్ చేసారుగా.!

Published on Jan 19, 2021 4:03 pm IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటివంటి బిగ్ బాస్ షో నాలుగో సీజన్ ఇటీవలే పూర్తి కాబడిన సంగతి తెలిసిందే. మరి అలాగే ముందు సీజన్ల కంటే కూడా భారీ రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ షోలో ముందు ఎపిసోడ్ లానే మంచి కెమిస్ట్రీ ఎపిసోడ్స్ కూడా కనిపించాయి. మరి అలా క్లిక్ అయిన జంట ఎవరన్నా ఉన్నారు అంటే అది అఖిల్ మరియు మోనాల్ గజ్జర్ అనే చెప్పాలి. ఈ ఇద్దరి మధ్యన జరిగిన ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో క్లిక్ అయ్యాయి.

మరి స్టార్ మా వారు ఈ ఇద్దరితో మళ్ళీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఈ ఛానెల్లో మరో షో స్టార్ట్ మ్యూజిక్ లో ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసారు. ఇందులో అఖిల్ మోనాల్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ను పాడడం విశేషం అంతే కాకుండా అఖిల్ కు మోనాల్ తో ఏదో సర్ప్రైజ్ ను కూడా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. మరి ఈ స్పెషల్ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :