బిగ్ బాస్ కొత్త ప్రోమో: ఆవ్యక్తి ఎవరో? ఇంకా రహస్యమే!

Published on Jun 21, 2019 11:46 am IST

స్టార్ మా బిగ్ బాస్ 3 కొరకు మరో ప్రోమో సిద్ధం చేసింది. ఓ స్వామిజీ తన భక్తులతో “మనసు కోతిలాంటిది,మరి అలాంటి మనసున్న మనుషులు ఓ ఇంట్లోకి చేరితే,వెటకారంతో మమకారంతో వారిని ఒక తాటిపైకి తెచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తిగల వ్యక్తి ఎవరు?” అని చెవుతుంటే ముసుగు ధరించి ఓ వ్యక్తి నడిచి వెళుతున్న ఆ వీడియో , బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే వ్యక్తుల మెంటాలిటీ, ఆటిట్యూడ్ ని కంట్రోల్ చేసి గేమ్ ని విజయవంతంగా నడిపించే ఆ వ్యాఖ్యాత ఎవరు? అనే ఉత్కంఠను క్యారీ చేసే విధంగా డిజైన్ చేశారు.

ఇప్పటివరకు బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాగార్జున చేస్తున్నారని పలు పత్రికలు చెబుతున్న ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదు. తాజా ప్రోమోలో కూడా స్టార్ మా వ్యాఖ్యత గురించి కానీ, ప్రారంభ తేదీ గురించి కానీ ఎటువంటి ప్రకటన చేయకుండానే సస్పెన్సు కొనసాగిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More