ప్రభాస్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.

Published on Aug 5, 2020 3:52 pm IST

బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన అక్కడ వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. దీంతో ప్రభాస్ మూవీ అంటే బాలీవుడ్ లో కూడా విడుదల కావాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణతో చేస్తున్న రాధే శ్యామ్ మూవీకూడా బాలీవుడ్ లో విడుదల అవుతుంది. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిన ప్రభాస్ 21మూవీ స్కేల్ ఆయన గత చిత్రాలకు మించి అని తెలుస్తుంది. యూనివర్సల్ అప్పీల్ కోసం ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనె ను తీసుకోవడం జరిగింది.

ఈ చిత్రం తరువాత ప్రభాస్ ఓస్ట్రైట్ హిందీ మూవీ చేయనున్నారట. ప్రభాస్ సాహో మరియు రాదే శ్యామ్ హిందీ వర్షన్స్ విడుదల హక్కులు దక్కించుకున్న టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారట. ఇక ఈ చిత్రం ఓ మైథలాజిల్ మూవీ అని తెలుస్తుండగా, డైరెక్ట్ హిందీలో తెరకెక్కి తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుందని సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రావచ్చని తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ రానున్నట్లే.

సంబంధిత సమాచారం :

More