మహేష్ బాబుతో అల్లు అరవింద్ సినిమా ?
Published on Jun 22, 2018 8:59 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. వీరిద్దరి కలయికలో సినిమా. ఆ ఊహే ఎంతో భారీగా ఉంది కదూ. ఇప్పుడు ఈ ఊహే నిజమయ్యే సూచనలున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేసే అరవింద్ గారు ఈసారి మహేష్ బాబుతో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారట.

ఈమేరకు మహేష్ బాబును కలిసి చర్చలు జరిపారని, మహేష్ కూడ సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నారని వినికిడి. మంచి కథ, దానికి సరైన దర్శకుడు ఇలా అన్నీ పక్కాగా కుదిరితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయట. మరి ఈ వార్తలకు నిజమో కాదో, ఒకవేళ నిజమైతే సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే మహేష్ లేదా అరవింద్ ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడే వరకు ఎదురుచూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook