రజనీ కోసం స్టార్ సింగర్ !

Published on May 22, 2019 12:03 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం ‘దర్బార్’. మురుగదాస్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. రజనీ సినిమా అంటే ప్రతి అంశాన్ని భూతద్దంలో చూస్తారు ఫ్యాన్స్. అందుకే చిత్రం అన్ని విధాలా గొప్పగా ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇందులో ఒక ముఖ్యమైన పాటను స్టార్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేత పాడిస్తున్నారని తెలుస్తోంది.

రజనీ ‘పేట’లో కూడా ఒక పాటకు గాత్రాన్ని అందించారు బాలు. కానీ అప్పుడు కొన్ని లైన్లు మాత్రమే పాడారు. దాంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అందుకే ఈసారి బాలుగారి చేత మొత్తం పాటను పాడిస్తున్నారట. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నయనతార కథానాయకిగా నటిస్తుండగా నివేత థామస్ ఒక కీలక పాత్ర చేస్తోంది.

సంబంధిత సమాచారం :

More