సల్మాన్ భాయ్ తో జగ్గు భాయ్!

15th, April 2018 - 11:14:16 AM

టాలీవుడ్ లో గత కొంత కాలంగా సీనియర్ హీరోలు ప్రస్తుతం మంచి నటులుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో ముందుగా ఎక్కువ క్రేజ్ ను అందుకున్నది మాత్రం జగపతి బాబు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో జగపతి చేస్తున్న పాత్రలు చాలా వరకు క్లిక్ అవుతున్నాయి. అలాగే అప్పుడపుడు పరభాషలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇప్పుడు జగ్గు బాయ్ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు. అది కూడా సల్మాన్ లాంటి హీరోకి గట్టి పోటీని ఇచ్చే పాత్రలో కనిపించనున్నాడట. త్వరలో సల్మాన్ ఖాన్ ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 చేయనున్నాడు. ఇదే నెలలో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్పనుల్లో దర్శకుడు బిజీగా ఉన్నాడు. అయితే విలన్ గా జగపతి బాబు అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతారని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు సమాచారం.