విలన్ గా నటిస్తోన్న డైలాగ్ రైటర్ !

విలన్ గా నటిస్తోన్న డైలాగ్ రైటర్ !

Published on Oct 1, 2018 11:27 PM IST

abburi ravi
బొమ్మరిల్లు చిత్రం దగ్గర నుంచి ఇటీవలే భారీ విజయం సాధించిన గూఢచారి చిత్రం వరకు ఎన్నో చిత్రాలకు మాటలు అందించి ఆ చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ మాటల రచయిత అబ్బూరి రవి విలన్ మారబోతున్నారు. ఆసక్తికరంగా ఈ టాలెంటడ్ రైటర్ తన తొలి చిత్రంలోనే ఓ ప్రతికూల పాత్రను పోషించనున్నాడు.

వివరాల్లోకి వెళ్తే అబ్బూరి రవి నటించబోతున్న తొలి చిత్రం పేరు ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. వినాయకుడు మరియు కేరింత చిత్రాల దర్శకుడు సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఆది సాయికుమార్, ఎయిర్టెల్ గర్ల్ సాషా చెట్రి, కార్తిక్ రాజు, మనోజ్ నందం, నిత్య నరేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రాన్ని ర్శకుడు సాయి కిరణే నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు