‘అక్కినేని అఖిల్’ కోసం ఆ స్టార్ రైటర్ ?

‘అక్కినేని అఖిల్’ కోసం ఆ స్టార్ రైటర్ ?

Published on Jun 29, 2018 11:00 AM IST

gopi mohan

డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ‘సంతోషం’ చిత్రంతో తెలుగు తెరకు స్క్రీన్ ప్లే రైటర్ గా పరిచయమయ్యారు రైటర్ గోపిమోహన్. ఎక్కువుగా శ్రీనివైట్ల, కోన వెంకట్ కాంబినేషన్ లో పనిచేసిన ఈయన ఆగడు చిత్రం ముందువరకు టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా వరుసగా సక్సెస్ లు అందుకున్నారు. ఐతే గత కొంతకాలంగా గోపిమోహన్ డైరెక్టర్ గా మారటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ముగ్గురు హీరోలకి సంబంధించి ఒక కథ రాశారు.

కాగా ఆ ముగ్గురు హీరోల పాత్రల్లోనూ సక్సెస్ ఫుల్ హీరోలనే తీసుకోని ఒక మల్టీస్టారర్ తెరకెక్కించాలని గోపిమోహన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఒక పాత్ర కోసం నాగశౌర్యతో చర్చించిన గోపిమోహన్, మెయిన్ హీరోగా అఖిల్ ను అనుకున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం అఖిల్ కి కథ కూడా వినిపించారు. తన పాత్రకు సంబంధించి అఖిల్ ఇంకొంచెం క్లారిటీ కోరారని, అలాగే కొన్ని మార్పులు కూడా సూచించారని సమాచారం. అఖిల్ కోసం గోపిమోహన్ ఆ మార్పులు చేసే పనిలో ఉన్నారట. ఆ మార్పులు అఖిల్ కి నచ్చితే త్వరలోనే రైటర్ గోపిమోహన్ నుండి ఒక మల్టీస్టారర్ రానుంది.

తాజా వార్తలు