కరీనా ప్లేస్ లో కంగనా.. నిజమేనా ?

Published on Jun 21, 2021 2:00 pm IST

నేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘సీత’ అనే ఓ పౌరాణిక కథను రాసిన సంగతి తెలిసిందే. అయితే, మొదట ‘సీత’ పాత్రలో దర్శక, నిర్మాతలు కరీనా కపూర్ ను ఖరారు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆమె కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. కానీ కరీనా కపూర్ ఇప్పుడు ఈ సినిమా చెయ్యట్లేదు అని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై కరీనా ఇంకా స్పందించలేదు.

కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోపక్క కరీనా బదులు కంగనా రనౌత్ ను ఈ పాత్ర కోసం తీసుకుపోవాలని మేకర్స్ కి నెటిజన్లు కామెంట్స్ చేసున్నారు. కరీనాతో పోల్చుకుంటే కంగనాకి మార్కెట్ ఎక్కువ. పైగా తలైవి తరువాత ఆమెకు సౌత్ ఇండియాలో కూడా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. మరి మేకర్స్ కంగనాని కరీనా ప్లేస్ లో తీసుంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :