మరో బయోపిక్ రాస్తున్న స్టార్ రైటర్ !

Published on Jun 2, 2021 9:05 pm IST

‘బాహుబ‌లి, బ‌జ‌రంగీ భాయ్‌జాన్’ చిత్రాల‌తో నేషనల్ స్టార్ రైటర్గా గుర్తింపు తెచ్చుకున్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ ప్రస్తుతం ఒక పాన్ ఇండియా కథ రాసే పనుల్లో ఉన్నారట. పైగా ఇది బ‌యోపిక్‌ అని రీసెంట్ గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు. సీతాదేవికి సంబంధించిన క‌థ‌ను త‌యారు చేస్తున్నానని, అలాగే గ్లోబెల్ టీచ‌ర్ 2020 అవార్డ్ గెలుచుకున్న టీచ‌ర్ రంజిత్ సిన్హ్ దిశాలె క‌థ‌ను కూడా త‌యారు చేస్తున్నానని ఈయన చెప్పుకొచ్చాడు.

190 దేశాల్లో ఎవ‌రు బెస్ట్ టీచ‌ర్ అని స‌ర్వే చేస్తే.. అన్ని దేశాల నుండి మ‌హారాష్ట్ర‌ గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌ రంజిత్ సిన్హ్ దిశాలె నెంబర్ వన్ స్థానంలో నిలిచి అవార్డు గెలుచుకున్నారు. అందుకే ఈ టీచర్ బయోపిక్ రాస్తున్నాడట. ప్ర‌స్తుతం విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ కు క‌థ‌ల‌ను అందిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు తలైవి సినిమా కూడా ప్రస్తుతం సెట్స్‌ పై ఉంది.

సంబంధిత సమాచారం :