‘దసరా’కి క్రేజీ కాంబినేషన్ మొదలుకానుంది ?

Published on Apr 19, 2021 9:05 pm IST

రాజమౌళి తరువాత సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పటికే, రాజమౌళి చేయనున్న ఈ మూవీ కోసం విజేంద్రప్రసాద్ కథ రాసాడని.. ఇలా ఈ సినిమా పై అనేక రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. కాగా తాజాగా మరో రూమర్ ఒకటి ఈ సినిమా గురించి బాగా వినిపిస్తోంది. ఈ ఏడాది దసరాకి ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారని.. నవంబర్ నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కథ గురించి ఎప్పటినుండో వస్తోన్న వార్త ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రాబోతోందట.

ఇక మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లినా.. 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారట. ఇక రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడట. ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :