చరణ్, శంకర్ ప్రాజెక్ట్ పై ఆ క్లారిటీ ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు.!

Published on Jun 8, 2021 3:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. మరి దీని తర్వాత చరణ్ మరో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో కలిసి వారిద్దరి కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 15వ అది చేయనున్నాడు. అయితే ఈ చిత్రం మొదలు పై మాత్రం ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చేలా లేదని తెలుస్తుంది.

శంకర్ ఆల్రెడీ టేకప్ చేసిన భారీ చిత్రం “ఇండియన్ 2” నే అందుకు కారణం అని తెలుస్తుంది. ఆ చిత్రం మేకర్స్ శంకర్ తో ఎక్కడా సంధికి కాంప్రమైజ్ అవ్వడం లేదట. అందుకే శంకర్ చరణ్ తో సినిమాపై పూర్తి దృష్టి పెడదాం అన్నా సమయం కలసి రావట్లేదని తెలుస్తుంది.

మొదట నుంచీ శంకర్ ఇంట్రెస్ట్ అంతా చరణ్ తో చేసే సినిమాపైనే ఉందని టాక్ వచ్చింది. కానీ మరో పక్క చిక్కులు కూడా గట్టిగానే ఉన్నాయి. మరి వీటన్నిటిని దాటి నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎలా ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారో అన్నది ఇపుడు మరింత ఆసక్తికర ప్రశ్నగా మారింది. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :