నార్త్ లో “పుష్ప”రాజ్ మ్యాడ్నెస్ తగ్గేదేలే.. వైరల్ గా డూప్ పుష్ప

నార్త్ లో “పుష్ప”రాజ్ మ్యాడ్నెస్ తగ్గేదేలే.. వైరల్ గా డూప్ పుష్ప

Published on Feb 6, 2025 3:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇపుడు ఒక్క సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా క్రేజీ బ్రాండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాల కంటే ముందే అల్లు అర్జున్ అంటే నార్త్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో రీచ్ ఉంది. ఇక పుష్ప లాంటి ఐకానిక్ రోల్ పడ్డాక మాత్రం తన రీచ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అని చెప్పాలి. ఇలా హిందీలో పుష్ప 2 రికార్డు వసూళ్లు కొల్లగొట్టగా ఇపుడు తన మ్యాడ్నెస్ ఏ లెవెల్లో ఉందో మరో విజువల్ వైరల్ గా మారింది.

తాజాగా ప్రయాగ్ రాజ్ లో పుష్ప గెటప్ లో ఓ నార్త్ ఆడియెన్ ఐకాన్ స్టార్ పుష్ప రోల్ ని డైలాగ్స్ తో దింపేసాడు. పైగా పక్కనే ఉన్న పోలీసులు సహా సామాన్య జనం కూడా పుష్ప 2 లో డైలాగ్స్ చెప్పమని అడుగుతూ అతను చెబుతుంటే అవి విని పోలీసులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో హిందీ ఆడియెన్స్ లో మాత్రం పుష్ప గారి రీచ్ కానీ తన హవా ఇప్పటికీ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు