Stock Market Crash: ఇన్వెస్టర్లకు చమురు సెగ.. ఆవిరైన లక్షల కోట్ల సంపద… ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?

Stock-Market

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భగ్గుమనడం భారత స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దలాల్ స్ట్రీట్ రక్తపాతాన్ని చవిచూసింది. సెన్సెక్స్ ఏకంగా 2,300 పాయింట్లకు పైగా పతనమవ్వగా, నిఫ్టీ 24,000 మార్కు కంటే దిగువకు పడిపోయింది. ఈ భారీ కుదుపుతో ఇన్వెస్టర్ల సంపద కేవలం గంటల వ్యవధిలోనే రూ. 12 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోవడం గమనార్హం.

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ముదరడంతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందనే భయాలు మొదలయ్యాయి. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా పెరిగింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి, ధరలు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇప్పటికే డాలర్‌తో రూపాయి విలువ రూ. 92.35 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకడం ఆందోళన కలిగిస్తోంది.

మరి ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?

అంటే.. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యుద్ధ మేఘాలు సద్దుమణిగి చమురు ధరలు అదుపులోకి వచ్చే వరకు మార్కెట్లలో ఇదే ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. ఐటీ, బ్యాంకింగ్ మరియు ఆటోమొబైల్ రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్‌ను మరింత బలహీనపరుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తొందరపడి కొనుగోళ్లు చేయకుండా, మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version