బజ్..ఈ తమిళ్ దర్శకునితో మహేష్ మరోసారి..?

Published on Jun 5, 2021 7:00 pm IST

మన టాలీవుడ్ ఉన్న స్టార్ హీరోస్ లో ఓ మోస్తరు ప్రయోగాత్మక చిత్రాలను కానీ సందేశాటంక చిత్రాలను కూడా ముందుకు తీసుకు రావడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. మరి అలా మహేష్ చేసిన పలు ఆసక్తికర ప్రాజెక్ట్స్ లో తన కెరీర్ లోనే భారీ హైప్ తెచ్చుకున్న చిత్రం మాత్రం “స్పైడర్” అనే చెప్పాలి.

తమిళ టాప్ దర్శకుల్లో ఒకరైన ఏ ఆర్ మురుగదాస్ ప్లాన్ చేసిన ఈ బై లాంగువల్ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. దీనితో మహేష్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలని మురుగదాస్ భావించారని తెలిసింది. అయితే ఈ కాంబో పరంగా అప్పట్లో అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు.

అయినా కూడా తర్వాత తర్వాత మురుగ మీద నమ్మకంతో మహేష్ ఇంకో సినిమా చేసిన పర్లేదు అనుకున్నారు. మరి బహుశా మళ్ళీ ఈ కాంబో రిపీట్ కావచ్చని నయా బజ్ బయటకి వచ్చింది. మురుగదాస్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో మహేష్ తో కూడా సినిమా అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ కాంబోలో మళ్ళీ మూవీ ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :