రెండో వారం స్ట్రాంగ్ హోల్డ్ చేస్తున్న “బంగార్రాజు”

Published on Jan 21, 2022 4:45 pm IST


అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ను జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించడం జరిగింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని థియేటర్ల లో దూసుకు పోతుంది.

నాగ చైతన్య, నాగార్జున లు ఇద్దరు కలిసి మరొకసారి వెండితెర పై సందడి చేయడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి బరిలో బంగార్రాజు మినహా పెద్ద చిత్రం ఏదీ లేకపోవడం తో రెండో వారం కూడా స్ట్రాంగ్ హోల్డ్ లో ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ వారాంతం ఎంత వసూళ్ళను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :