హీరోయిన్ కి స్ట్రాంగ్ మైండ్ ఉండాలంటున్న మిల్క్ బ్యూటీ

హీరోయిన్ కి స్ట్రాంగ్ మైండ్ ఉండాలంటున్న మిల్క్ బ్యూటీ

Published on Jun 29, 2014 4:36 PM IST

Tamanna
ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళం మరియు హిందీ సినిమాల్లో బిజీబిజీగా ఉంటోంది. తాజాగా హిందీలో సినిమా రిలీజ్ అయ్యాక ప్రస్తుతం తెలుగు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ మిల్క్ బ్యూటీకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే టాలీవుడ్ టాప్ గ్లామరస్ హీరోయిన్స్ లో తమన్నా కూడా ఒకరు.

కానీ తమన్నా మాత్రం హీరోయిన్ కి బ్యూటీ అనేది అంత ముఖ్యం కాదు. బ్యూటీ కంటే ఎక్కువగా స్ట్రాంగ్ మైండ్ అవసరం అని అంటుంది. ‘సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ ఎఫెక్ట్ ఎక్కువగా నటీనటులపైనే పడుతుంది. అలాంటి సందర్భాల్ని మీ స్ట్రెంగ్త్ తో డీల్ చెయ్యాలి. నువ్వు స్ట్రాంగ్ గా లేవు అంటే నువ్వు ఎంచుకున్న దారిని కోల్పోతావని’ తమన్నా అంటోంది.

తమన్నా ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘ఆగడు’, ప్రభాస్ సరసన ‘బాహుబలి’ సినిమాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు