ఇంద్రనీల్ సేన్‌గుప్తా, మృదాంజలి, జారా షా, కర్తవ్య శర్మ, అభిషేక్,నీరజ్, మృణాల్, కీలక పాత్రధారులుగా రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఐతే 2.0’ మార్చి 16న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఫిర్మ్ 9 బ్యానర్ పై కె.విజయరామరాజు, హేమంత్ వల్లపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాలు లేకుండా ఉన్న నలుగురు యువకులు డబ్బుకోసం క్రిమినల్స్‌గా ఎలా మారారన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కడం జరిగింది.
ప్రస్తుతం ఇంటర్‌నెట్ వలలో ఇరుక్కుపోయిన ప్రజలకు ఈ సినిమా ఒక సందేశం ఇవ్వబోతోందని సమాచారం. కౌశిక్ అభిమన్యు సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందించడం జరిగింది. మెసేజ్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
